ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Sep 4 2025 10:49 AM | Updated on Sep 4 2025 10:49 AM

ట్రై

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా...

వినాయక నిమజ్జన

వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు...

వరంగల్‌ క్రైం: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్‌ ట్రై సిటీ పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర వెళ్లే మార్గంలో, నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వాహనాలు రోడ్డుపై నిలపరాదని, ఈ విషయంలో ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

● ములుగు – భూపాలపల్లివైపు నుంచి వచ్చే భారీ వాహనాలు హైదరాబాద్‌కు ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డునుంచి వెళ్లాలి

●భూపాలపల్లి – పరకాల నుంచి ఖమ్మం వెళ్లాల్సినవి ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కి కరుణాపురం– వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్‌ రోడ్డు మీదుగా ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి.

● భూపాలపల్లి – పరకాల నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట వైపునకు కొత్తపేట – రెడ్డిపాలెం – జాన్‌పీరీలు– గొర్రెకుంట నుంచి వెళ్లాలి

● కరీంనగర్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్లే భారీ వాహనాలు చింతగట్లు వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి యూటర్న్‌ తీసుకొని కరుణాపురం – వెంకటాపూర్‌ – ఐనవోలు– పున్నేలు క్రాస్‌ రోడ్డు వద్ద ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి

● ఖమ్మం నుంచి కరీంనగర్‌ – హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్‌ రోడ్డు– ఐనవోలు ఆర్చ్‌–వెంకటాపూర్‌– కరుణాపురం మీదుగా వెళ్లాలి

● హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం – వెంకటాపూర్‌–ఐనవో లు– పున్నేలు క్రాస్‌ రోడ్డు నుంచి ఖమ్మం వెళ్లాలి

● నిమజ్జన సమయంలో సిటీ లోపలికి భారీ వాహనాలకు అనుమతి లేదని, నగరం అవతలే ఆపుకోవాలి.

● హైదరాబాద్‌ నుంచి నర్సంపేట వైపునకు వెళ్లే వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్‌ఆర్‌ మీ దుగా వచ్చి ఆరెపల్లి వద్ద దిగి కొత్తపేట– రెడ్డిపాలెం– జాన్‌పీరీలు– గొర్రెకుంట మీదుగా వెళ్లాలి

● నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లేవి భారీ వాహనాలు గొర్రెకుంట – జాన్‌పీరీలు– రెడ్డిపాలెం– కొత్తపేట – ఓఆర్‌ఆర్‌ మీదుగా ప్రయాణించాలి.

సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు ద్వారా ఎగ్జిట్‌ అవ్వాలి.

శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహ వాహనాలు వయా హంటర్‌రోడ్డు, అదాలత్‌, హనుమకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి

ఎకై ్సజ్‌ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాలనుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ బంధం చెరువులో నిమజ్జనం చేయాలి

చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపునకు వెళ్లాలి.

గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో వాహనాలు నిలుపరాదు

వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

సన్‌ప్రీత్‌ సింగ్‌

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు1
1/2

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు2
2/2

ట్రై సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement