● వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలో ఘటన
మామునూరు: లారీ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. హనుమకొండ గోపాల్‌పూర్‌కు చెందిన పెద్దూరి భవాని రెండో కుమారుడు సాకేత్(23) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పని నిమిత్తం బైక్‌పై వరంగల్ రంగశాయిపేటకు వచ్చాడు. పని ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆర్టీఏ జంక్షన్ సమీపానికి చేరగానే ఖమ్మం నుంచి ఉర్సు గుట్టవైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో అదే లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు
విద్యుదాఘాతంతో రైతు మృతి
నెల్లికుదురు : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సౌల్లతండా శివారు మూడుగుట్టల తండాలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ యాకు (35) తనకున్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సాగుచేశాడు. అయితే చేనును కోతులు ధ్వంసం చేస్తున్నాయని పంట చుట్టూ విద్యుత్ తీగను అమర్చాడు. ఈ క్రమంలో బుధవారం ప్రమాదవశాత్తు ఆ తీగకు తాకి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాము కాటుతో బాలిక..
భూపాలపల్లి రూరల్: నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన భూపాలపల్లి పట్టణంలోని జంగేడులో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. జంగేడుకు చెందిన గూడెపు మల్లయ్య, రేష్మ దంపతుల రెండో కుమార్తె సాన్విశ్రీ (9) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రోజుమాదిరిగానే కుటుంబ సభ్యులంతా మంగళవారం రాత్రి నిద్రించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి పాము.. సాన్విశ్రీ నిద్రిస్తున్న బెడ్‌పై పడి చిన్నారిని కాటేసింది. దీంతో చిన్నారి నిద్ర నుంచి లేచి ఏడుస్తుండగా తల్లిదండ్రులు వెంటనే మేల్కోని చూడగా పాము పరుగు తీయడాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లి దండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం