
ఉమ్మడి జిల్లాకు 2,607.300 మెట్రిక్ టన్నుల యూరియా
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్‌లోని గూడ్స్ షెడ్‌కు ఐపీఎల్ కంపెనీకి చెందిన యూరియా శుక్రవారం చేరింది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వ్యవసాయ అధికారి అనురాధ సూచనల ప్రకారం వరంగల్ జిల్లాకు 427.3, హనుమకొండకు 570, ములుగు 280, భూపాలపల్లి 400, జనగామకు 480, మహబూబాబాద్ 450 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. దిగుమతి అయిన యూరియాను ఆయా జిల్లాలోని మండలాలకు చేరవేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,607.300 మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలకు యూరియాను పంపిస్తున్నారు.