సైబర్‌ మోసం.. | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసం..

Sep 7 2025 7:13 AM | Updated on Sep 7 2025 7:13 AM

సైబర్‌ మోసం..

సైబర్‌ మోసం..

పీఎం కిసాన్‌ కేవైసీ లింక్‌ పేర రూ.లక్ష మాయం

లింగాలఘణపురం : సైబర్‌ మోసగాళ్లు బరితెగించారు. పీఎం కిసాన్‌ కేవైసీ పేరిట లింక్‌ పంపి ఓ ఆర్‌ఎంపీ(వైద్యుడు) నుంచి క్షణాల్లో రూ.లక్ష మాయం చేశారు. ఈ ఘటన మండలంలోని పటేల్‌గూడెంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ నర్సయ్య ఫోన్‌కు ఇటీవల పీఎం కిసాన్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఏపీకే లింక్‌ వచ్చింది. దీంతో ఓపెన్‌ చేసి అందులోని ఫామ్‌ పూర్తి చేశాడు. వెంటనే అతడి ఫోన్‌ సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి తన యూనియన్‌ బ్యాంకు అకౌంట్‌ యూపీఐ పిన్‌ మార్చి విడతల వారీగా ఈ నెల 5న వెంట వెంటనే రూ.49,000, రూ.25,000, రూ.10,000, రూ.10,000, రూ.1,000, రూ.5,000 ఇలా మొత్తం రూ.లక్ష డ్రా చేసుకున్నారు. యూనియన్‌ బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి తమ ఖాతాదారుడైన నర్సయ్యకు ఫోన్‌ చేసి డబ్బులు ఇలా డ్రా చేస్తున్నావ్‌..నువ్వేనా అంటూ అడగడంతో కాదని చెప్పాడు. దీంతో వెంటనే నర్సయ్య ఖాతాలో ఉన్న రూ.7వేలు డ్రా చేశారు. అనంతరం సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లు గ్రహించిన ఆర్‌ఎంపీ.. 1930కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

చేంజ్‌ ఓవర్‌ బ్రేకర్‌ ఫెయిల్యూర్‌తోనే విద్యుత్‌ ప్రమాదం

నిర్ధారించిన అధికారులు వినియోగదారుడికి నోటీసు జారీ

హన్మకొండ: హనుమకొండలోని మర్కజీ స్కూల్‌ వద్ద ఇటీవల జరిగిన విద్యుత్‌ ప్రమాదానికి చేంజ్‌ ఓవర్‌ బ్రేకర్‌ ఫెయిల్యూర్‌ కారణమని టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు నిర్ధారించారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేతతో ఇదే మెయిన్‌ రోడ్‌లో ఉన్న ఇండస్‌ బ్యాంకు సిబ్బంది జనరేటర్‌ ఆన్‌ చేశారు. ఈ సమయంలో అదే ప్రాంతంలో మరమ్మతు చేస్తుండగా జనరేటర్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ వెనుకకు రావడంతో కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదాన్ని ఎన్పీడీసీఎల్‌ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం హనుమకొండ సర్కిల్‌ డీఈ (టెక్నికల్‌–సేఫ్టీ), హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి, ఏడీఈలు మల్లికార్జున్‌, రాజు ఘటనాస్థలిని సందర్శించి ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేశారు. ఇండస్‌ బ్యాంక్‌ జనరేటర్‌ ఆన్‌ చేయడం ద్వారా రిటర్న్‌ విద్యుత్‌ సరఫరా జరిగిందని అంచనాకు వచ్చారు. నాన్‌ రిటర్న్‌ బ్రేకర్‌/స్విచ్‌ పని చేయకపోవడాన్ని గుర్తించి సంబంధిత వినియోగదారుడికి నోటీసు జారీ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈ (టెక్నికల్‌–సెఫ్టీ) ఎ.విజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ డీజీ సెట్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజీ సెట్స్‌, ఇన్‌వర్టర్లు కలిగిన వినియోగదారులు తప్పనిసరిగా నాన్‌ రిటర్న్‌ బ్రేకర్‌ సక్రమంగా పని చేస్తుందో... లేదో పరీక్షించి నిర్ధారించుకోవాలన్నారు. లైన్‌ క్లియర్‌ సమయంలో రిటర్న్‌ సరఫరా జరిగి సిబ్బందికి ప్రమాదం జరిగే అవకాశముందన్నారు.

కంట్రోల్‌ రూంను సందర్శించిన సీపీ

వరంగల్‌ క్రైం: పోలీస్‌ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ శని వారం సందర్శించారు. ఈసందర్భంగా సీపీ కంట్రోల్‌ రూంలో పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడి, అత్యవసర కాల్స్‌ స్వీకరణ, స్పందన విధానం, డ యల్‌ 100 కార్యకలాపాలను సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ కాల్‌ను అత్యంత జాగ్రత్తగా, తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించే పోలీస్‌ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తతో విధులు ని ర్వర్తించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమని కమిషనర్‌ తెలి పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కంట్రోల్‌ రూం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement