కొనసాగుతున్న యూరియా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న యూరియా కష్టాలు

Sep 8 2025 5:08 AM | Updated on Sep 8 2025 5:08 AM

కొనసా

కొనసాగుతున్న యూరియా కష్టాలు

యూరియా పంపిణీని పరిశీలించిన ఎస్పీ

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రాఽథమిక వ్యవసాయ సహకారం సంఘం, శనిగపురం గ్రామంలోని పీఏసీఎస్‌ విక్రయ కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది పురుష, మహిళా రైతులు బారులుదీరారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ శనిగపురం పాతజీపీ కార్యాలయం వద్దకు చేరుకుని యూరియా పంపిణీ చేయిస్తామని, సంయమనం పాటించాలని రైతులకు నచ్చచెప్పి వరుస క్రమంలో నిలబెట్టించారు. ఈ క్రమంలో పాతజీపీ కార్యాలయం వద్ద రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులు తీసుకుని ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓ బాలాజీ టోకెన్లు ఇవ్వగా డీఎస్పీ తిరుపతిరావు, ఏడీఏ శ్రీనివాసరావు పీఏసీఎస్‌ విక్రయ కేంద్రం వద్ద యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. సీసీఎస్‌ సీఐ హతీరాం, ఎస్సైలు దీపిక, మౌనిక, సూరయ్య, పోలీసు, పీఆర్‌, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ దగ్గర టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు అశోక్‌, అలీంహుస్సేన్‌, ఏఆర్‌, సివిల్‌ పోలీసు, పీఆర్‌, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ వద్ద 444 బస్తాలు, శనిగపురం పీఏసీఎస్‌ విక్రయ కేంద్రం వద్ద 666 బస్తాలు, ఈదులపూసపల్లి గ్రామంలో 222 బస్తాలు, సికింద్రాబాద్‌ తండా గ్రామంలో 222 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశారు. అయితే మహబూబాబాద్‌, శనిగపురం పీఏసీఎస్‌ విక్రయ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో రైతులు మిగిలిపోగా వారి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులు తీసుకుని వాటిపై సీరియల్‌ నంబర్లు రాసి, స్టాంపులు వేసి ఇచ్చారు. యూరియా స్టాకురాగానే రైతులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ వద్ద ఓ మహిళా రైతు సొసైటీ షట్టర్లపైకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో పాటు యూరియా కోసం ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని తిడుతూ శాపనార్థాలు పెట్టగా పోలీసులు ఆమెను సముదాయించి పంపించారు.

యూరియా పంపిణీని పరిశీలించిన ఎస్పీ

కురవి: మండల కేంద్రంతో పాటు నేరడ గ్రామంలో ఆదివారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ సుధీర్‌రాంనాఽథ్‌ కేకన్‌ పరిశీలించారు. కురవిలోని సొసైటీ కార్యాలయంలో అధిక సంఖ్యలో రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఎస్పీ సొసైటీకి చేరుకొని క్యూలో ఉన్న రైతుల పరిస్థితిని పరిశీలించారు. ఓ వృద్ధురాలు యూరియా కోసం రావడంతో ఆమెను తాడు పక్క నుంచి బయటకు వచ్చేలా చూశారు. ఓ రైతు ఆధార్‌కార్డు జిరాక్స్‌లు తీసుకుని వస్తుండగా పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. నేరడలోని యూరియా పంపిణీ కేంద్రానికి వెళ్లి పరిశీలించారు.

పోలీసు బందోబస్తు మధ్య

నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లిగూడెంలో, శ్రీరామగిరి సొసైటీల ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య 668 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ నిర్వహించారు. ఎర్రబెల్లిగూడెం సొసైటీ ఆధ్వర్యంలో 444 యూరియా బస్తాల పంపిణీని ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు. అలాగే శ్రీరామగిరి గ్రామ సొసైటీలో 224 యూ రియా బస్తాలను పోలీసు బందోబస్తు మధ్య రైతులకు అందజేశారు. కార్యక్రమంలో డీఏఓ వియజనిర్మల, మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్‌ చందా నరేష్‌, సీఐ గణేష్‌, ఎస్సైలు చిర్ర రమేష్‌ బాబు, క్రాంతికిరణ్‌, ఏఓ షేక్‌ యాస్మిన్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న యూరియా కష్టాలు1
1/1

కొనసాగుతున్న యూరియా కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement