
తూతూ మంత్రంగా తనిఖీలు
మహబూబాబాద్: వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు విక్రయిస్తున్నారు. నాణ్యత లేని ఆహారపదార్థాలు ఇతర వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. తూ కంలో కూడా మోసాలకు పాల్పడుతూ సొమ్ము చే సుకుంటున్నారు. కొంతమంది కూరగాయల వ్యా పారులు, చిరువ్యాపారులు బాట్లకు బదులుగా రా ళ్లు వాడుతున్నారు. దీంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు.
జిల్లాలో 1000కిపైగా షాపులు..
జిల్లాలో 1000కిపైగా కిరాణా షాపులు, 19 సూపర్ మార్కెట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్‌లో తప్పని సరిగా ఎలక్ట్రానిక్ కాంటాలు వాడాలి. కిరాణా షాపుల్లో కూడా తప్పనిసరి గా వాడాలి. అయితే కొంత మినహాయింపుతో పండ్లు, కూరగాయలు, ఇతర చిరువ్యాపారులు మా న్యువల్ కాంటాలు వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు సంవత్సరానికి ఒకసారి, మాన్యువల్ కాంటాలు రెండేళ్లకు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటు ంది. అధికారులు కూడా తనిఖీ చేసి తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. తనిఖీలు లేకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నా రు.
బేకరీ షాపుల్లో మరీ దారుణం..
తూనికలు కొలతల అధికారులతో పాటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కూడా బేకరీలను తనిఖీ చేయాలి. అయితే తనిఖీలు లేకపోవడంతో కాలంచెల్లిన వస్తువులు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల తనిఖీల్లో కాలం చెల్లిన వస్తువులు ఉండగా కేసు నమోదు చేశారు.
పెట్రోలు బంక్‌ల్లో..
జిల్లా కేంద్రం తొర్రూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్, నర్సంపేట రోడ్డులోని ఓ పెట్రోలు బంక్‌లో తూకంలో తేడా వచ్చిందని, కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళన చేశారు. ఆ బంక్‌ల్లో అధికారులు శాంపిల్ తీసుకెళ్లారే తప్ప చర్యలు చేపట్టలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా జరిగాయి. నేటికీ నిబంధనలకు విరుద్ధంగా బంక్‌ల నిర్వహణ చేపడుతున్నారు. కొన్నింటిలో మరుగుదొడ్లు లేవు.. ఇతర సౌకర్యాలు లేకుండానే నిర్వహిస్తున్నారు.
మూడు జిల్లాలకు ఒక్కరే అధికారి..
జిల్లా తూనికలు కొలతల అధికారిగా పని చేసిన విజయ్‌కుమార్ గత నెల 8న పదోన్నతిపై ఆది లాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. కాగా భూపాలపల్లి జిల్లా తూనికల కొలతల అధికారి శ్రీలతకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లాకు కూడా ఆమె ఇన్‌చార్జ్ కావడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
ఖాళీగా కుర్చీలు..
కలెక్టరేట్‌లో ఒక గదిని తూనికల కొలతల అధికారి కార్యాలయానికి కేటాయించారు. ఆగదిలోనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆఫీస్ కొనసాగుతోంది. తూనికలు కొలతల అధికారితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. అటెండర్ ఉండగా వరంగల్‌కు డిప్యుటేషన్‌పై పంపారు. దీంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. సమాధానం చెప్పేనాథుడే కరువయ్యాడు.
మూడు జిల్లాలకు ఒక్కరే తూనికలు, కొలతల అఽధికారి
కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు
నాసిరకం వస్తువుల విక్రయాలు
నష్టపోతున్న వినియోగదారులు

తూతూ మంత్రంగా తనిఖీలు