దగ్గు.. జ్వరం | - | Sakshi
Sakshi News home page

దగ్గు.. జ్వరం

Sep 8 2025 5:08 AM | Updated on Sep 8 2025 5:08 AM

దగ్గు

దగ్గు.. జ్వరం

న్యూస్‌రీల్‌ – 8లోu

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
న్యూస్‌రీల్‌
సర్వే వివరాలు..

జ్వరం

విరేచనాలు

దగ్గు, జలుబు

రాపిడ్‌11,988293

7,311

మెడికల్‌ క్యాంపు 1,481

62

808

హాస్టల్‌ క్యాంపు 186

13

90

మొత్తం13,655 368

8,209

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఎక్కువగా జ్వరపీడితులు ఉన్నట్లు ఇటీవల వైద్యారోగ్యశాఖ నిర్వహించిన సర్వేల్లో తేలింది. పారిశుద్ధ్యం, దోమలు, తాగునీటి కలుషితం, తీసుకునే ఆహారం, వాతావరణంలో ఆకస్మికంగా వచ్చిన మార్పులే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపంతో సీజనల్‌ వ్యాధుల కట్టడిలో విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.

వైద్యారోగ్యశాఖ సర్వే..

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్‌ఎంల సహకారంతో ఇటీవల ఫీవర్‌ సర్వేలు నిర్వహించింది. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రాపి డ్‌ సర్వే చేశారు. ఇందులో 30,436 మందిని పరీక్షించారు. ఇందులో 11,988మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 293 విరేచనాల సమస్య, 7,311 మంది దగ్గు, జలుబు(శ్వాస కోశ సమస్య) ఉంది. అదేవిధంగా 994 గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. 44,192 మందిని పరీక్షించారు. వీరిలో 1,481 మందికి జ్వరం, 62 మంది విరేచనాలు, 808మంది దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టల్స్‌లో మొత్తం 133 క్యాంపులు నిర్వహించి 6,007 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 186 మంది జ్వరం, 13 మంది విరేచనాలు, 90 మంది దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

జ్వరపీడితులు..

గత మూడు నెలలుగా జిల్లాలో నమోదైన కేసులను పరిశీలిస్తే అత్యధికంగా దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం 13,655 మంది జ్వర పీడితులు, 8,209 మంది దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అలాగే 231 మంది డెంగీ జ్వరం బారిన పడిన వారు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, పరీక్షలు చేయించుకున్నవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే వారి సంఖ్య రెట్టింపుగానే ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.

డెంగీ కేసులు : 231

మలేరియా : 04

రోజురోజుకూ పెరుగుతున్న జ్వరపీడితులు

13,655 మందికి జ్వరం.. 8,209 మందికి శ్వాస సంబంధ సమస్య

కిటకిటలాడుతున్న ప్రభుత్వ,

ప్రైవేట్‌ ఆస్పత్రులు

పారిశుద్ధ్య సమస్య

ఇటీవల కురిసిన వర్షాలతో మురుగునీరు చేరడం, గిరిజన పల్లెలు, గూడేలు, తండాల్లో అపరిశుభ్ర వాతావరణం, తాగునీటి కలుషితమైంది. కాగా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పంచాయతీ సిబ్బంది తమ వద్ద ఉన్న ట్రాక్టర్ల ద్వారా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్‌, కిరోసిన్‌ చల్లడం, గంబూసియా చేపలు వదలడం, మురికి కాల్వలను శుభ్రం చేసేందుకు నిధుల లేమితో ముందుకు సాగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జ్వరాలు వచ్చిన వారికి మందులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. వీరితో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కలిసి రాకపోవడం, చిన్న చిన్న లీకేజీలను సరిచేసేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

దగ్గు.. జ్వరం1
1/3

దగ్గు.. జ్వరం

దగ్గు.. జ్వరం2
2/3

దగ్గు.. జ్వరం

దగ్గు.. జ్వరం3
3/3

దగ్గు.. జ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement