డోర్నకల్: జైన మతస్తులు పది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న దస్‌లక్షణ్ పర్వ్ వేడుకలు ఆదివారం ముగిశాయి. స్థానిక ఆదినాథ్ భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలో ఆదినాథ్ భగవాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన నరేశ్‌జైన్‌ను ప్రత్యేక వాహనంలో ఊరేగించి ఘనంగా సన్మానించారు. శోభాయాత్రలో జైనమతానికి చెందిన సీ్త్ర, పురుషులు రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడిపారు.
వీరభద్రస్వామి ఆలయం మూసివేత
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని ఆలయ పూజారులు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయంలో పూజాధికాలు పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలిపారు.
డీపీఓ పర్యవేక్షణ
గార్ల: కలెక్టర్ ఆదేశాల మేరకు గార్ల మండలంలో కొనసాగుతున్న యూరియా పంపిణీ కేంద్రాలను డీపీఓ హరిప్రసాద్ ఆదివారం పర్యవేక్షించారు. గార్ల పీఏసీఎస్ కార్యాలయంలో కొనసాగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డీపీఓతో పాటు తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ పరిశీలించారు. డీపీఓ మాట్లాడు తూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, జిల్లా అధికార యంత్రాంగం ప్రతీ రైతుకు యూరియా అందించడం కోసం ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ ద్వారా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో సీఈఓ ఎస్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.
కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
తొర్రూరు: రైతులకు సరఫరా చేస్తున్న యూ రియాలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ విజయ నిర్మల, తొ ర్రూరు ఆర్డీఓ గణేష్ హెచ్చరించారు.ఆదివారం డివి జన్ కేంద్రంలోని ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీలు చేసి, ఎరువుల బస్తాలు, పురుగుల మందుల స్టాక్, బిల్ బుక్స్‌ల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి యూరియా బస్తాతోపాటు ఇతర ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఏఓ రాంనర్సయ్య, డీటీ నర్సయ్య, ఆర్‌ఐ నజీముద్దీన్ పాల్గొన్నారు.
చిన్నగూడూరు: జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. ఆదివారం మండలంలోని ఉగ్గంపల్లి, జయ్యారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాలను మండల అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విడతల వారీగా ఎప్పటికప్పుడు యూరియా బస్తాలను తెప్పిస్తున్నామని అన్నారు. యూరి యాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. నానో యూరియాతో మొక్క ఎదుగులతో పాటు అనేక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. మండలంలో యూరి యా నిల్వల గురించి ఏఓ అజ్మీరా భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఈఓలు సరిత, శిరీష, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు ఉన్నారు.
కల్వల సెంటర్ తనిఖీ
కేసముద్రం: కేసముద్రం పీఏసీఎస్ పరిధిలోని కల్వల గ్రామ సెంటర్‌ను డీఏఓ విజయనిర్మల ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు యూరియా పంపిణీతోపాటు, సెంటర్‌లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌ను పరిశీలించారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఎస్సై మురళీధర్‌రాజు, ఏవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.