
అమ్మవారికి అదనపు కమిషనర్ పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ ఈ.శ్రీనివాసరావు సందర్శించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, అర్చకులు శేషు.. ఆయనను ఘనంగా స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు మహదాశీర్వచనం అందజేశారు. వాల్గో ఇన్‌ఫ్రా సీఈఓ అండ్ ఎండీ గుంటి శ్రీధర్‌రావు, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ మార్నేని వెంకటేశ్వరరావు, పారిశ్రామికవేత్త వీరమల్ల రవీందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మేడారం ఈఓ వీరస్వామి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్లు అనిల్‌కుమార్, సంజీవరెడ్డి, ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు.