గోవాలో ఎంపీ కావ్య పవర్‌పాయింట్ ప్రజంటేషన్
హన్మకొండ చౌరస్తా: ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిపుంజ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో శనివారం గోవాలో నిర్వహించిన సెమినార్‌లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ ప్రపంచంలో మహిళల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. చిన్న, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు.. పురుషుల కంటే 8 శాతం తక్కువ సెల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్‌ఫోన్ వినియోగంలో 13శాతం తేడా ఉన్నట్లు వివరించారు. నేటికీ ప్రపంచంలో 405 మిలియన్ల మంది మహిళలు ఇంకా డిజిటల్‌కు చేరుకోలేదన్నారు. వరంగల్‌లో చారిత్రక ఘటనలు, కాకతీయ రాణి రుద్రమదేవి, సమ్మక్క, సారలమ్మ చరిత్రను వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, వడ్డీలేని రుణాలు అందజేస్తూ మహిళల ఆర్థిక పురోగతికి ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నారన్నారు.


