
బ్యాలెన్సింగ్ తప్పిన క్రేన్
● భయాందోళనకు గురైన
మేయర్, కలెక్టర్, కమిషనర్
వరంగల్ అర్బన్ : గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ చెరువు వద్ద క్రేన్ బ్యాలెన్సింగ్ తప్పడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయకుల నిమజ్జనాన్ని ప్రారంభించేందుకు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏసీపీ శుభం, డీసీపీ సలీమా, కార్పొరేటర్లు, అధికారులు సుమారు 24 మంది వరకు క్రేన్‌లోకి ఎక్కారు. క్రేన్ మొరాయించడంతో కొంత మంది అధికారులను సిబ్బంది దించారు. అనంతరం వినాయక ప్రతిమలతో చెరువులో తెప్పమీదికి దిగారు. మేయర్, కలెక్టర్లు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనాన్ని ప్రారంభించారు. తిరిగి క్రేన్‌లోకి వీరితోపాటు గజ ఈతగాళ్లు మొత్తం 17 మంది వరకు ఎక్కారు. క్రేన్ కొద్ది మేరకు పైకి వెళ్లిన తర్వాత బ్యాలెన్సింగ్ తప్పి ఊగింది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మళ్లీ క్రే న్‌ను తెప్ప మీదికి తీసుకొచ్చి, కొంతమందిని దించారు. తదుపరి వీరిని ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీ ల్చుకున్నారు. సేఫ్టీ లైఫ్ జాకెట్లు లేకుండా చెరువులో నిమజ్జనానికి ఆయా శాఖల అధికారులు అనుమతి ఎలా ఇస్తారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఎంజీఎం/కమలాపూర్: గణపతి నిమజ్జనం చేసే 12 ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 వాహనాలు అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఈశిబిరాల వద్ద మూడు షిఫ్టులలో వైద్యాధికారి, సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఈమేరకు డీఎంహెచ్‌ఓ అప్పయ్య శుక్రవారం కటాక్షపూర్, పెద్దాపూర్ చెరువు, ప్రగతి సింగారెడ్డి బ్రిడ్జి, గుండ్ల సింగారం చెరువు, కమలాపూర్, హసన్‌పర్తి, సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వైద్య శిబిరాలను సందర్శించి సిబ్బంది సూచనలి చ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వాతి, సా యికృష్ణ, నాగరాజు, శాంతిప్రియ, నవీన్, కవిత, రోహిత్, విజయరెడ్డి, ఇర్ఫాన్, సౌమ్య, సురేశ్, సా యిశ్రీ, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
కిడ్నాప్.. ఆపై కిరాతంగా హత్య
భూపాలపల్లి అర్బన్ : ఓ యువకుడిని కిడ్నాప్ చేసి..ఆపై కిరాతంగా హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ఎండీ బాసిత్ (20)ను, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమీపంలో నిందితులు కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి కాల్చి హత్య చేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బాసిత్ నాలుగు రోజుల క్రితం భూపాలపల్లి పట్టణంలో కిడ్నాప్‌నకు గురైనట్లు మృతుడి తల్లి సబియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన బబ్లూ, ప్రశాంత్, కుషాల్, మరికొందరిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలో తాడ్వాయి సమీపంలో కాల్చిన మృతదేహం శుక్రవారం కనిపించింది. దీంతో సీఐ నరేష్‌కుమార్, ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. మృతుడిపై ఇప్పటికి అనేక కేసులు నమోదై ఉన్నాయి. మద్యం, గంజాయి మత్తులో గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో హత్య చేసినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

బ్యాలెన్సింగ్ తప్పిన క్రేన్

బ్యాలెన్సింగ్ తప్పిన క్రేన్

బ్యాలెన్సింగ్ తప్పిన క్రేన్