
పశువైద్య ఆరోగ్య నిర్వహణ భేష్
● నవాబుపేట సంతలో ఫిలిప్పీన్స్ వైద్యులు
లింగాలఘణపురం : తెలంగాణలో పశువైద్య ఆరోగ్య నిర్వహణ తీరు బాగుందని ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వైద్యులు ప్రాన్సిస్, వోవేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జనగామ జిల్లా మండలంలోని నవాబుపేట సంతలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువుల్లో వ్యాధుల నియంత్రణ, యాజమాన్య పద్ధతులు, రవాణాకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. భారతదేశ పశుమాంస ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అఫ్జల్ అజీజ్, పశువైద్యులు దేవేందర్, భగవాన్‌రెడ్డి, సాయికార్తీక్, పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.