
క్రీడల అభివృద్ధికి కృషి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో క్రీడల అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుస్తామని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) సమన్వయంతో పనిచేయాలని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించిన స్పోర్ట్స్ బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల క్రీడాప్రతిభను ఫిజి కల్ డైరెక్టర్లు గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అ వసరం ఉందన్నారు.క్రీడారంగంలో యూనివర్సిటీ ప్రతిష్ట పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ క్రీడలను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. స్పోర్ట్స్ బోర్డు చైర్మన్ టి. మనోహర్ మాట్లాడుతూ యూనివర్సిటీపరిధిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నారని, వారికి క్రీడలపై ఆసక్తి పెరిగేలా కృషిచేయాలన్నారు. అనంతరం పలువురు ఫిజికల్ డైరెక్టర్లు మాట్లాడుతూ క్రీడలకోసం మౌలిక వసతులు పెంచాలన్నారు. కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, జె. సోమన్న, వెంకన్న, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, వర్సిటీ పరిఽధిలోని ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం కేయూ ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ షెడ్యూల్ వెల్లడించారు. కబడ్డీ, అథ్లెటిక్స్, క్రికెట్ తదితర క్రీడాపోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. కాగా, ఈనెల 11 నుంచి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
● పీడీలు సమన్వయంతో పనిచేయాలి
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి