
అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు
● అక్కడికక్కడే డ్రైవర్ మృతి
దంతాలపల్లి: పెళ్లి బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లగా.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ పట్టణంలోని గోపాలపురానికి చెందిన ఓ ముస్లిం కుటుంబంతో పాటు బంధువులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఖమ్మంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో దంతాలపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బస్సు అదుపు తప్పి రేకుల ఇంటిని ఢీకొట్టింది. ఈక్రమంలో ఇంటి పైకప్పు రేకు మెడకు కోసుకుపోవడంతో డ్రైవర్ దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, బస్సులో ఉన్న సుమారు 30మందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న ఆరుగులు కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు.

అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు