
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
● అదనపు జూనియర్
సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ
మహబూబాబాద్ అర్బన్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో శనివారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సమాజంలో మూఢనమ్మకాలు, ఆచారాలను అనుసరించి కొంత మంది ఇప్పటికీ బాల్యవివాహాలు చేస్తున్నారన్నారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. పోక్సో చట్టాన్ని తెలుసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బిందు మాధవి, టౌన్ ఎస్సై మౌనిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.