
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
మహబూబాబాద్ అర్బన్: గ్రంథాలయాలు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ రీడింగ్ గదిని ప్రిన్సి పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు విద్యార్థులు న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా ప్రపచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. గ్రంథాలయ అధ్యాపకుడు రాజశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్ కుమార్, మసూద్ అహ్మ ద్, సాంబశివరావు, శ్రీనివాస్, హతీరాం ఉన్నారు.