
ఎప్పుడు ఫోన్ వచ్చినా..
క్షతగాత్రులు, ఇతర వైద్య సహాయం అవసరమున్న వారు ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులోనే ఉంటున్నాం. వెంటనే స్పందించి ఆస్పత్రులకు తరలించి సకాలంలో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం.
– జక్కుల వీరన్న, పైలెట్
ప్రాథమిక వైద్య సేవలు
అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌కు సమాచారం రాగానే స్పందిస్తున్నాం. అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందిస్తూ సైలెన్ బాటిల్ పెట్టడం, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు అందజేస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది.
– బంగారి, టెక్నీషియన్
అత్యవసర సమయాల్లో...
ప్రభుత్వం, వైద్య అధికారులు సూచన మేరకు అంబులెన్స్ సేవలను విస్తృతంగా అందజేస్తున్నాం. అత్యవసర సమయాల్లో ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వైద్య సేవల కోసం సమాచారం ఇస్తే వెంటనే అంబులెన్స్ సంఘటన స్థలికి చేరుకుంటుంది.
– బత్తిని మహేష్, 108 జిల్లా మేనేజర్

ఎప్పుడు ఫోన్ వచ్చినా..

ఎప్పుడు ఫోన్ వచ్చినా..