
మునిగలవీడులో కేంద్ర బృందం పర్యటన
నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం పర్యటించి, ఈజీఎస్ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించింది. ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య సేవలను బృందం సీనియర్ పరిశీలన అధికారి దామోదర్, పరిశీలన అధికారి అశ్విన్ గోపాల్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఈజీఎస్ జాబ్ కార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, మాజీ సర్పంచ్ నల్లాని నవీన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.