
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్‌మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు.