గంగారం: మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. భూభారతి సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం- డీడబ్ల్యూఓ శిరీష
కురవి: తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామంలోని రైతు వేదికలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం అన్నప్రాసన, సీమంతాలు, అక్షరభ్యాసం, వివిధ రకాల ఆహారపదార్థాల ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహా రం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సూపర్‌వైజర్ సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రాకపోకలకు అంతరాయం
డోర్నకల్: బుగ్గవాగు పొంగడంతో గురువారం డోర్నకల్–లింగాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కామెపల్లి మండల పరిధి లోని బుగ్గవాగు పొంగి రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో డోర్నకల్–కొత్తలింగాల మార్గంలో రాకపోకలు నిలిచాయి.
వైద్యులు అందుబాటులో ఉండాలి
గూడూరు: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీసీహెచ్‌ఎస్ చింత రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. సిబ్బంది సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరన్ననాయక్ వైద్యులు, నర్సు, స్టాఫ్ నర్సుల కొరతపై వివరించారు. ముఖ్యంగా స్టాఫ్ నర్సు, నర్సులు అవసరమని, తొందరగా కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
ఆయిల్ పామ్ సాగుతో ఆదాయం
మహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ గెలల కత్తిరింపుపై మహబూబా బాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి ఆయిల్ పామ్ మొక్కల గెలల కత్తిరింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళ్లెం జనార్దన్ రెడ్డి, కళ్లెం మధుకర్ రెడ్డి, ఏఈఓ రంజిత్, ఈజీ ఫాం టూల్స్ కంపెనీ ప్రతినిధులు రమేశ్, రాజు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి కరుణాకర్, శ్రీకాంత్, కుమార్ డ్రిప్ కంపెనీ డీసీఓ అశోక్, ఎఫ్‌సీఓ నవీన్, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి క్రాంతికుమార్, కంబాలపల్లి ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ

ఆకస్మిక తనిఖీ