
చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
● జూలై 31న రైలు ఎక్కబోతూ జారిపడడంతో తీవ్రగాయాలు
ఖిలా వరంగల్: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ ఓ వ్యాపారి వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద జారి పడి తీవ్రగాయాలు కాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రామన్నపేటకు చెందిన వ్యాపారి చందా జగదీశ్వర్(62) గత నెల 31న ఉదయం 8.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా.. రైల్వే జీఆర్పీ అధికారులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం జగదీశ్వర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మృతుడి కుమారుడు అభిషేక్‌కు అప్పగించినట్టు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌రాజు పేర్కొన్నారు.