
ప్రజాసమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వాలు మారుతున్న పేదరికం మాత్రం పోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ములుగు జిల్లాలో పేదరికం అధికంగా ఉందని, ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది ఆస్తులు పెంచుకోవటం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంపాల రవీందర్, అహ్మద్ పాషా, భిక్షపతి, రాజు, తోట మల్లికార్జునరావు, బండి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు