
క్రీడా హబ్‌గా వరంగల్..
వరంగల్ స్పోర్ట్స్: భవిష్యత్‌లో వరంగల్ క్రీడాహబ్‌గా మారుతుందని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు హాజరయ్యారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో నిర్వహించే పోటీలను వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి ముందుకొచ్చారన్నారు. ఈ ఏడాది నుంచే క్రీడా పాఠశాలలో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎమ్మెల్యేల మందరం కలిసికట్టుగా జిల్లా క్రీడాభివృద్ధి, వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం 5కే మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన అథ్లెట్లకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.
వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట
ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, నాగరాజు
జేఎన్‌ఎస్‌లో అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
హాజరైన 1,400 మంది అథ్లెట్లు

క్రీడా హబ్‌గా వరంగల్..

క్రీడా హబ్‌గా వరంగల్..

క్రీడా హబ్‌గా వరంగల్..

క్రీడా హబ్‌గా వరంగల్..