
అధికారుల నిర్లక్ష్యం!
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించింది. కాగా, సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఉద్యోగులు చెప్పిన మాటలు విని ఫీజులు చెల్లించిన వారు ఇప్పుడు ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయని డబ్బులు తీసుకున్న అధికారులు ఇప్పు డు రకరకాల కొర్రీలు పెడుతూ.. ప్రొసీడింగ్స్ ఇవ్వ డం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
క్రమబద్ధీకరణ అవుతుందని..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి నెలరోజుల గడువు ఇచ్చారు. ఇది 2020 డిసెంబర్ 31 వరకు రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్న వారికే వర్తింపజేశారు. ఈమేరకు మహబూబా బాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సి పాలిటీల పరిధిలో 26,001 మంది రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్నారు. అయితే ఇందులో ప్రభు త్వ నిబంధనల మేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 20,586 దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించుకునేందుకు అర్హత ఉందని అధికారులు చెప్పారు. దీంతోపై నాలుగు మున్సిపాలిటీల పరిధిలో భూ యజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్లు చేయడం, ఫ్లెక్సీలు పెట్టి అవగాహన కల్పించారు.
రూ.16.49 కోట్ల ఆదాయం..
ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యాలయాలకు వెళ్లి కొందరు, ఆన్‌లైన్ ద్వారా మరికొందరు ఫీజులు చెల్లించారు. ఇలా మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.11.60కోట్లు, తొర్రూరు రూ.4కోట్లు, డోర్నకల్ రూ. 50లక్షల, మరిపెడ రూ. 99లక్షల ఆదాయం వచ్చింది.
ప్రొసీడింగ్స్‌లో జాప్యం
మున్సిపల్ అధికారులు మూడు దశల్లో పరిశీలన చేసి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతనే భూ క్రమబద్ధీకరణకు ఫీజు తీసుకున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు కలిపి మొత్తం 20,586 మంది డబ్బులు చెల్లించారు. ఇందులో 6,708 మంది రూ.16,49,60,000 చెల్లించారు. ఇందులో 2,571 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ ఇవ్వగా 4,137 మంది మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజులు చెల్లించడంతో తమ భూమికి ఎలాంటి ఇబ్బందులు రావని భావించిన యజమానులకు మున్సిపల్ అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు ప్రొసీడింగ్ వెంటనే ఇవ్వాలంటే తమకు ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం. అదే విధంగా ఎల్‌ఆర్‌ఎస్ చలాన్‌లు చెల్లించిన తర్వాత ఇప్పుడు భూమి విలువలో తేడా పడిందని.. కొత్త లెక్కల ప్రకారం చూస్తే మరిన్ని డబ్బులు చెల్లించాలని చెబుతున్నట్లు యజమానుల అంటున్నారు. ఇప్పటికే డబ్బులు చెల్లించామని ఇప్పుడు మళ్లీ డబ్బులు అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తమకు ప్రొసీడింగ్‌లు వెంటనే ఇచ్చేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని ఇళ్ల స్థలాల యజమానులు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
మున్సిపాలిటీల్లోని ఎల్‌ఆర్‌ఎస్ వివరాలు
మున్సిపాలిటీ అర్హత పొందిన ఫీజు ప్రొసీడింగ్
దరఖాస్తులు చెల్లించినవి ఇచ్చినవి
మహబూబాబాద్ 12,304 4044 1004
తొర్రూరు 6,181 2015 1267
మరిపెడ 1,228 427 78
డోర్నకల్ 873 222 222
మొత్తం 20,586 6,708 2,571
ఎల్‌ఆర్‌ఎస్ కోసం డబ్బులు చెల్లించి ఎదురుచూపులు
ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ ఇళ్ల స్థలాల యజమానుల ప్రదక్షిణ
కొర్రీలు పెడుతూ
కాలయాపన చేస్తున్న ఉద్యోగులు

అధికారుల నిర్లక్ష్యం!

అధికారుల నిర్లక్ష్యం!