
వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండాలి
గార్ల: వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. బుధవారం స్థానిక సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. కొంతమంది వైద్యులు ఎందుకు విధులకు హాజరు కాలేదని డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అందరూ కచ్చితంగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఏడాది క్రితం పోస్టుమార్టం గది నిర్మించారని, ఇక్కడే మృతదేహాల పోస్టుమార్టం నిర్వహించాలని సీపీఎం జిల్లా, మండల నాయకులు అడిషనల్ కలెక్టర్‌కు విన్నవించారు.
బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ..
గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల వసతిగృహంలోని కిచెన్‌షెడ్, సరుకుల స్టోర్‌రూంలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన వేడివేడి ఆహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీటీ సంజీవ, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా కిషన్ తదితరులు ఉన్నారు.
అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో