
తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవాలి
నెహ్రూసెంటర్: తీజ్ పండుగను బంజారాలు ఘనంగా నిర్వహించుకోవాలని డాక్టర్ నెహ్రూనాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ వెంకన్ననాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 16 కోట్లకు పైగా ఉన్న బంజారాలు అందరూ ఒకే భాష, ఒకే సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తున్నారని, ఆగస్టు మొదటి శుక్రవారం మొదలుకుని పదో రోజు కఢావో ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. సంఘం నాయకులు మాలోత్ సురేష్, డాక్టర్ వీరన్న, భూక్య స్రవంతి, రాంబాబు, బోడ రమేష్, బాదావత్ సురేష్, బాబులాల్, సురేష్, రాజ్‌కుమార్, స్వాతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.