
భీమునిపాదం సందర్శన నిలిపివేత
● జలపాతం గేట్ మూసిన పోలీసులు
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అడవిలోని భీమునిపాద జలపాతం సందర్శనను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటకులు జలపాతం వద్దకు రాకుండా గురువారం గేట్ మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉధృతంగా జాలువారుతోంది. ఈ క్రమంలో పర్యాటకులు ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి దిగి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు భాగంగా ఎస్సై గిరిధర్‌రెడ్డి గేట్ ను మూసివేశారు. దీంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేకపోయినా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను జలపాతం చూడకుండా గేట్ మూసివేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశా రు. కాగా, జాలువారుతున్న భీమునిపాదం జలపా తం దృశ్యాలు గురువారం పలు ప్రతికల్లో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జలపాతా నికి పర్యాటకుల తాకిడి ఉంటుందనే కారణంతో సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
నకిలీ వైద్యుడిపై కేసు
ఎంజీఎం: ఎంబీబీఎస్ విద్యార్హత పత్రాలు లేకుండా హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌజ్ సమీపంలో హెల్పింగ్ హ్యాండ్ డ్రగ్ ఎడిక్షన్, సైకియాట్రిక్ కేంద్రాన్ని నిర్వహిస్తున్న రాముపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి కేంద్రానికి వచ్చే రోగులకు తనకు తానే తాను డాక్టర్‌గా పేర్కొంటూ చట్టవిరుద్ధంగా అల్లోపతి మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నాడు. రెండు అంతస్తుల భవనంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాడుతున్నారని టీజీఎంసీ రిజిస్ట్రార్ దండం లాలయ్యకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.