
విద్యా సామర్థ్యాలు పెంచాలి
చిన్నగూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, అంగన్‌వాడీ సెంటర్, ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలకు సిద్ధం చేస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించి, వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, డైట్ మెనూ పక్కా పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాకయ్య, ఎంపీఓ రజని, ఎంఈఓ రవికుమార్, హెచ్‌ఎం రెహమాన తదితరులు ఉన్నారు.
హైస్కూల్ సందర్శన..
కురవి: మండలంలోని నేరడ జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ అధ్వైత్‌కుమార్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులకు వెళ్లారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలను చదివించారు. నోట్ బుక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్