
ఇక.. భూసేకరణ వేగవంతం
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
కురవి: క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. టీబీ ముక్త్‌భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బలపాల పీహెచ్‌సీ పరిధి మొగిలిచర్ల జీపీలో క్షయ వ్యాధి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. రెండేళ్లలో దేశం నుంచి క్షయవ్యాధిని తరిమికొట్టాలన్నారు. 60ఏళ్లుపై బడిన వారిని, షుగర్ వ్యాధి, బరువు తక్కువగా ఉన్న వారిని, గతంలో టీబీ వ్యాధిగ్రస్తులు, కుటుంబ సభ్యులను ప్రత్యేక సర్వేలో గుర్తించాలన్నారు. వారందరికీ తెమడ పరీక్షలు, ఎక్స్‌రేలు నిర్వహించాలని తెలిపారు. అనుమానం ఉన్న టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు స్రవంతి, కరుణాకర్, వైద్య ఆరోగ్య సిబ్బంది భద్రమ్మ, శోభ, ఏసుమణి, రాకేశ్, హేమలత, అరుణ, చంద్రకుమార్, రమేశ్, మానస, కృష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా ఆహారం తీసుకోవాలి
డోర్నకల్: వర్షాలు, వాతావరణంలో మార్పులతో బాలికలు తాజా ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలిక పాఠశాలలో శుక్రవారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ సందర్శించి పలువురు బాలికలను పరీక్షించారు. అనంతరం స్టోర్‌రూంలో నిల్వ చేసిన బియ్యంతో పాటు ఆహార పదార్థాలు, డైనింగ్ హాలు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్