
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
కురవి: వైద్య, ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండలంలోని బలపాల పీహెచ్‌సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల స్టోర్ రూమ్, సిబ్బంది హాజరు పట్టిక, ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో