
స్థానిక పోరుపై చర్చ
శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
● 42శాతం బీసీ రిజర్వేషన్లపై వీడని చిక్కుముడి..
● జిల్లాలో 193 ఎంపీటీసీ,
482 సర్పంచ్ స్థానాలు
● మండలం యూనిట్‌గా రిజర్వేషన్ల
కేటాయింపు
● జీపీల వారీగా ఓటర్ల విభజన
సాక్షి, మహబూబాబాద్: పల్లెల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన నాటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఏడాదిన్నరగా వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పదవులు ఖాళీ కావడంతో జీపీ నుంచి జిల్లా వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదిగో ఎన్నికలు వస్తున్నాయి.. అదిగో ఎన్నికలు వస్తున్నాయని అనడమే తప్ప నిర్వహించడం లేదు. ఇప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదం పొంది, పార్లమెంట్ ఆమోదం కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అని ఆశావహులు, నాయకులు చర్చించుకుంటు న్నారు.
పెరిగిన స్థానాలు
గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జిల్లాలో ఒక మున్సిపాలిటీ, రెండు మండలాలు, 21 గ్రామ పంచాయతీలు పెరిగాయి. జిల్లాలో 461 పాత గ్రామ పంచాయతీలు ఉండగా.. కొద్దిరోజుల క్రితం మరో 26 కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి. అయితే కేసముద్రం మున్సిపాలిటీ కావడంతో ఐదు గ్రామ పంచాయతీలు అందులో కలిశాయి. దీంతో ప్రస్తుతం 18మండలాల పరిధిలో 482 గ్రామ పంచాయతీలు, 4వేలకుపైగా వార్డులు ఉన్నాయి. అదే విధంగా గతంలో ఉన్న 16 మండలాలకు తోడుగా కొత్తగా ఏర్పడిన సీరోలు, ఇనుగుర్తి మండలాలను కలుపుకొని 18 మండలాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. అలాగే గతంలో 198 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేసముద్రం మున్సిపాలిటీలో కలిసిన ఆరు ఎంపీటీసీ స్థానాలు, నెల్లికుదురు మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం సవరణలో పోయింది. అదే విధంగా గంగారం మండలంలో కొత్తగా మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం 193 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
పంచాయతీల వారీగా ఓట్ల విభజన
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ వారీగా ఉన్న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీల వారీగా విభజించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో 2,76,608 పురుషులు, 2,85,856 మహిళలు, 25 మంది ఇతరలు కలిపి మొత్తం 5,62,489 మంది ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మారుమూల తండాలు, గిరిజన గ్రామాల్లో పోలింగ్ బూత్‌లు లేవు. కానీ ఇప్పుడు జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు, 4,110 వార్డులకు అభ్యర్థులు బరిలో నిలుస్తారు. కావునా అసెంబ్లీ ఓటరు జాబితాను పరిశీలించిన ఎంపీడీఓలు జీపీల వారీగా విభజించి పంచాయతీ సెక్రటరీలకు పంపారు. వారు పంచాయతీలోని వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జిల్లాలోని 18 ఎంపీపీలు, 18 జెడ్పీటీసీ స్థానాల్లో 7 చొప్పున బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అదే విధంగా 193 ఎంపీటీసీల్లో 77 స్థానాలు, 482 సర్పంచ్ స్థానాల్లో 192 బీసీలకు దక్కే అవకాశం ఉందని రాజకీయ నాయకులు లెక్కలు వేస్తున్నారు.
మండలాల వారీగా సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల వివరాలు
మండలం సర్పంచ్ ఎంపీటీసీ
బయ్యారం 29 12
చిన్నగూడూరు 11 06
దంతాలపల్లి 18 11
డోర్నకల్ 26 10
గంగారం 12 05
గార్ల 20 11
గూడూరు 41 17
ఇనుగుర్తి 13 06
కేసముద్రం 29 11
కొత్తగూడ 24 08
కురవి 41 15
మహబూబాబాద్ 41 13
మరిపెడ 48 15
నర్సింహులపేట 23 10
నెల్లికుదురు 31 13
పెద్దవంగర 26 09
సీరోలు 18 06
తొర్రూరు 31 15
మొత్తం 482 193

స్థానిక పోరుపై చర్చ