
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్: ప్రసుత్త పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రంఅన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీలో భౌతిక శాస్త్ర విభాగంలో ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ బల్పుల తయారీపై నిర్వహించిన రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డిగ్రీలతో ఉద్యోగావకాశాలు తక్కువ అని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ఎండీ చేస్తేనే వైద్య వృత్తికి ఉపయోగపడుతుందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను కూడా చదవాలన్నారు. స్వయం ఉపాధి, వివిధ పరిశ్రమల స్థాపనకు కూడా నైపుణ్యాలు అవసరమన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, వర్క్‌షాప్ కన్వీనర్ వరలక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో ఈసీఐఎల్ పూర్వ ఉద్యోగి ఎల్‌ఈడీ బల్పుల తయారీ విధానం వివరించారు. సమావేశంలో అధ్యాపకులు జితేందర్, ప్రవీణ్, ఎ. సరిత, సరిత, ప్రశాంత్, కరుణాకర్, నాగయ్య, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అల్యుమిని ఔదార్యం
అభినందనీయం
● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్ : నిట్ 99వ బ్యాచ్ అల్యుమిని విద్యార్థులు ఇంపాక్ట్–99 పేరిట పేద, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్‌లోని బోస్ సెమినార్ హాల్ కాంప్లెక్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఇంపాక్ట్–99 స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిట్ వరంగల్ కళాశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇన్‌స్టిట్యూట్ రుణం తీసుకునేందుకు 99వ బ్యాచ్ విద్యార్థులు ఇంపాక్ట్–99 (ఇన్స్‌ఫైరింగ్ మీనింగ్ ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యుమిని కంట్రిబ్యూషన్స్ టూగెదర్)ను ఏర్పాటు చేసి విద్యార్థులకు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 99వ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఈసీఈ విభాగం పి.స్వర్ణలత, కెమికల్ విభాగం నుంచి జాన్.జేలు పాల్గొని నిట్‌కు చెందిన 2 నుంచి 4వ ఇయర్ విద్యార్థుల్లో 22 మందికి రూ.4.58 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్ : మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్, గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జి.అన్నపూర్ణ బుధవారం తెలిపారు. ప్రిన్సిపాల్ పోస్టుకు 10 సంవత్సరాల బోధన అనుభవం, ఎంఫార్మసీతోపాటు సర్వీస్ సర్టిఫికెట్లు, పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే, గెస్ట్ లెక్చరర్ పోస్టులకు బీఫార్మసీ, ఎంఫార్మసీతో పొటు సర్వీస్ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 19న సాయత్రం 4గంటల వరకు జిరాక్స్ పత్రాలతో కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ధ్రువపత్రాలు పరిశీలించి డెమోకు, ఇంటర్వ్యూలకు ఎంపికై న అభ్యర్థులకు ఫోన్ చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 8897434233 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి