
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
డోర్నకల్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ మేళా కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెన్నారం గ్రామ పరిధిలో గురువారం అదనపు కలెక్టర్ ఆయిల్‌పామ్ మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన,పట్టు పరి శ్రమ అధికారి మరియన్న, ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, హెచ్‌ఓ శాంతి ప్రియ,ఏఓ మురళీమోహన్,ఏఈఓలు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సమస్యపై దృష్టి సారించాలి...
డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పారిశు ద్ధ్య సమస్యపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య సమస్య, ఇందిర మ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యను వంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై నిత్యం సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి తదితరులు పాల్గొన్నారు.