
పెరుగుతున్న గోదావరి
● రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13మీటర్లకు చేరిన నీటిమట్టం
ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం వరకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరింది. వరద క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలవనరుల అధికారులు తెలిపారు. సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరుకుంది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది.