కాజీపేట మీదుగా గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌

Jul 11 2025 6:13 AM | Updated on Jul 11 2025 6:13 AM

కాజీపేట మీదుగా గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌

కాజీపేట మీదుగా గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌

కాజీపేట రూరల్‌ : ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం దివ్యదక్షిణ్‌ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ను నడిపిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పి.వి.వెంకటేశ్‌ తెలిపారు. ఈ మేరకు కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో గురువారం టూరిస్ట్‌ ట్రైన్‌ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ కాజీపేటకు 1.55 గంటలకు, వరంగల్‌కు 2.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు 7 రాత్రులు, 8 రోజులు పాటు ఉండే గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌ను తమిళనాడు, కేరళలోని తిరువణ్ణమలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తాంజావూరు ప్రదేశాల సందర్శన ఉంటుందని వివరించారు. ఒకరికి బుకింగ్‌ సాధారణ టికెట్‌ ధర రూ.14,100, 3 ఏసీ టికెట్‌ ధర రూ.22,300, 2 ఏసీ టికెట్‌ ధర రూ. 2900 ఉంటుందన్నారు. ఈ ట్రైన్‌కు సికింద్రాబాద్‌, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో బోర్డింగ్‌ పాయింట్స్‌ ఉంటాయన్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఈ యాత్ర ట్రైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్‌ బుకింగ్‌, ఇతర వివరాలకు 040–27702407, 9701360701, 9281495843, 9281495845 నంబర్లు లేదా www.irctctourism.comలో సంప్రదించాలని కోరారు. ఐఆర్‌సీటీసీ టూరిజం మానిటర్స్‌ కె.ప్రశాంత్‌, ఎం.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఈ నెల 19న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభం

ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ వెంకటేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement