
కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి
కురవి: కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని రాష్ట్ర లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబు అన్నా రు. మంగళవారం బలపాల, కురవి పీహెచ్‌సీలను ఆయన తన బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని వివరించారు. స్పర్శలేని రాగి రంగు మచ్చలను గుర్తించి వెంటనే చికిత్స అందివ్వాలన్నారు. 2027 నాటికి ఈ వ్యాధి మన దేశం నుంచి నిర్మూలించడానికి సమష్టి బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు వ్యాధి నిర్మూలన అధికారి విజయ్, పీహెచ్‌సీ వైద్యాధికారులు స్రవంతి, విరాజిత, యశస్విని, బృందం సభ్యులు సకలారెడ్డి, వెంకటేశ్వరాచారి, శ్రీనివాసరెడ్డి, పారా మెడికల్ ఆఫీసర్స్ ఎల్లయ్య, వరుకరణ్‌రెడ్డి, వైద్య సిబ్బంది భద్రమ్మ, గౌసుద్దీన్, శోభ, రాజకుమారి, నీరజ, అనురాధ, సుహాసిని, నసీమ, కటాక్ష్మి, జ్యోతి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబు