
వినియోగంలోకి కొత్త పోస్టులు..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌కు కొత్తగా మంజూరైన పోస్టులను వినియోగంలోకి తీసుకొస్తూ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా కేటాయింపులు చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏళ్లుగా వినియోగంలో లేని 216 అన్ యూజ్డ్ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ నూతనంగా 339 ఉద్యోగాలు మంజూరు చేసింది. ఈ పోస్టులను కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్లు, ఇతర విభాగాల వారీగా పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సర్కిళ్ల వారీగా విభజన..
కొత్తగా మంజూరైన చీఫ్ ఇంజనీర్ పోస్టును కార్పొరేట్ కార్యాలయం సీఈ ప్లానింగ్, ఐటీ, స్వ్వాడ్‌గా నిర్ణయించారు. చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టును కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం ఆడిట్‌గా, జాయింట్ సెక్రటరీ పోస్టును లీగల్, రిక్రూట్‌మెంట్ జాయింట్ సెక్రటరీగా, ఇప్పటికే ఉన్న జాయింట్ సెక్రటరీ పోస్టును మెడికల్, పెన్షన్ జాయింట్ సెక్రటరీగా రీ డిజైన్ చేశారు. కొత్తగా మంజూరైన నాలుగు ఎస్‌ఈ పోస్టుల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయానికి కేటాయించారు. అయితే కార్పొరేట్ కార్యాలయంలో డీపీఈ పోస్టు ఒకటే ఉండగా మరోటి రావడంతో వీటిని సర్కిళ్ల వారీగా విభజించారు. డీపీఈ–1 కింద హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం సర్కిళ్లు, డీపీఈ–2 కింద కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ సర్కిల్ ఉండేలా పునర్విభజించారు. ఒక ఎస్‌ఈ పోస్టును ములుగు సర్కిల్‌కు, మరో రెండు ఎస్‌ఈ పోస్టుల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయం కమర్షియల్ ఎస్‌ఈగా, మరోటి ఎంకై ్వరీస్ ఎస్‌ఈగా కేటాయించారు. జనరల్ మేనేజర్ ఒకటి మంజూరు కాగా దీనిని కార్పొరేట్ కార్యాలయం రిక్రూట్‌మెంట్‌గా, ఇప్పటికే ఉన్న జీఎం పోస్టును మెడికల్, పెన్షన్ విభాగం జీఎంగా రీడిజైన్ చేశారు. మంజూరైన నాలుగు డివిజనల్ ఇంజనీర్ పోస్టులలో కాటారం డివిజన్, ములుగు సర్కిల్ డీఈ టెక్నికల్, మధిర డివిజన్, కార్పొరేట్ కార్యాలయానికి ఒక డీఈ పోస్టుగా పంపిణీ చేశారు. నాలుగు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్‌కు కేటాయించారు. ఆరు ఏడీఈ పోస్టులను ములుగు ఎస్‌ఈ కార్యాలయం, మహదేవపూర్ సబ్ డివిజన్, తాడ్వాయి సబ్ డివిజన్‌కు ఒక్కొక్కటి, మరో మూడు పోస్టులు కార్పొరేట్ కార్యాలయానికి అలాట్ చేశారు. అకౌంట్స్ ఆఫీసర్ పోస్టును ములుగు సర్కిల్‌కు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు రెండు మంజూరు కాగా ఒకటి ములుగు సర్కిల్‌కు, మరోటి అశ్వరావుపేట ఈఆర్‌ఓకు కేటాయించారు. పర్సనల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు మంజూరు కాగా వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ సర్కిల్‌కు అలాట్ చేశారు. అలాగే, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్స్, అసిస్టెంట్ లైన్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ పోస్టులను సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా అలాట్ చేశారు. కొత్త పోస్టులతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ములుగు సర్కిల్‌తో పాటు, ములుగు సర్కిల్ పరిధిలో కాటారం, ఖమ్మం జిల్లాలో మధిర నూతన డివిజన్‌గా, ములుగు జిల్లాలో మహదేవ్‌పూర్, తాడ్వాయి సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
టీజీ ఎన్పీడీసీఎల్‌కు 339 ఉద్యోగాలు
ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కంపెనీ అవసరాల మేరకు కేటాయింపు..