
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
కొత్తగూడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు తప్పుతోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అంటూ కొర్రీలు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదా రులు ఎవరైనా ఇల్లు నిర్మించుకోలేము అని తెలిపితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తామని అన్నారు. నిర్మాణ పనులను హౌసింగ్ శాఖ పర్యవేక్షణ పెంచాలని ఏఈ లాల్‌సాబ్‌కు సూచించారు.
రాజన్న పాలనే ఆదర్శం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆదర్శంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సీతక్క అన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 108, ఆరోగ్య శ్రీ పథకాలను ఆయన స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన యాదగిరి యుగేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సారయ్య, నారాయణరెడ్డి, మొగిళి, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్,
సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క