
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
మరిపెడ: గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ హాజరై హాస్టల్ పరిసరాలు, గదులు, వంటశాల, స్టోర్‌రూమ్, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈగలు, దోమలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంట మనుషులు పరిశుభ్రత పాటించాలని సూచించారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ స్వామి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విద్యాసాగర్, సుదర్శన్, లక్ష్మీకుమారి, ఏఎన్‌ఎంలు సరళ, శ్రీదేవి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరిధిలో పారా లీగల్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మంగళవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచించిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు నిమిత్తం పారా లీగల్ వలంటీర్లను నియమిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
విస్తృత పోలీసు బందోబస్తు
మహబూబాబాద్ రూరల్: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు పర్యటన సందర్భంగా మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండా గ్రామంలో మంగళవారం విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ, ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, పదహారు మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, జిల్లా పోలీసు శాఖ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది మొత్తంగా 375 మంది బందోబస్తు విధులు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
శాకంబరీగా వీరభద్రస్వామి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని అర్చకులు మంగళవారం శాకంబరీగా అలంకరించారు. భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భద్రకాళి అమ్మవారు శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మాత్రా, సర్వమంగళగా
భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉద యం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించా రు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని మాత్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని సర్వమంగళ అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి