అభివృద్ధి పథం.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథం..

Jul 9 2025 6:57 AM | Updated on Jul 9 2025 6:57 AM

అభివృ

అభివృద్ధి పథం..

రూ.400 కోట్ల పనులకు

శంకుస్థాపనలు

హాజరైన డిప్యూటీ సీఎం,

ఐదుగురు మంత్రులు

మానుకోటలోని సోమ్లాతండా,

కేసముద్రంలో బహిరంగ సభలు

స్థానిక ఎన్నికలకు సమాయత్తం

కావాలని కార్యకర్తలకు పిలుపు

సాక్షి, మహబూబాబాద్‌/ కేసముద్రం/మహబూబాబాద్‌రూరల్‌: మహబూబాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.

కార్యకర్తల్లో జోష్‌..

బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నిండింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కళాశాల, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్‌ రాంచంద్రునాయక్‌, ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు,ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌, కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, కేసముద్రం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవరెడ్డి, అధికారులు ఉన్నారు.

మంత్రులు ఏమన్నారంటే...

– వివరాలు 8లోu

అభివృద్ధి పథం..1
1/2

అభివృద్ధి పథం..

అభివృద్ధి పథం..2
2/2

అభివృద్ధి పథం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement