
తండాల్లో సీత్లా పండుగ సందడి
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం గిరిజన తండాల్లో సీత్లాభవాని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు సీత్లా భవాని వేడుకలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈమేరకు ఆయా తండాల్లో గిరిజన మహిళలు వ్యవసాయ భూముల వద్దకు గంపలతో చేరుకుని సీత్లాభవాని దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంతుబలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పశుసంపదతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.

తండాల్లో సీత్లా పండుగ సందడి