
జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో (అటానమస్) కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 22, 23 తేదీల్లో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆవిష్కరించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగం అధిపతి అరుణ, అధ్యాపకులు ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
హసన్‌పర్తి: కడుపు నొప్పి బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన బండి సదానందం(44) ఓ రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం పొందినా నయం కాలేదు.దీంతో జీవితంపై విరక్తి చెందిన సదానందం శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే ఆదివారం ఉదయం హసన్‌పర్తిలోని ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సాంబమూర్తి కథనం ప్రకారం.. మహముత్తారం మండలం స్థంభంపల్లి(పీపీ) గ్రామానికి చెందిన గుండు శేఖర్(34) పని నిమిత్తం బైక్‌పై భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని సంతోషిమాత ఆలయం ఎదుట జాతీయ రహదారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారికేడ్‌ను అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తున్నట్లు క్రమంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు.

జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ