
నిర్వాహకుల ఇష్టారాజ్యం!
డబ్బు, పరపతి ఉన్నవారికి కొనుగోలు కేంద్రాల్లో అందలం
సాక్షి, మహబూబాబాద్: రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనీ, పరపతి ఉన్నవారికే అనుకూలంగా మారాయి. కేంద్రాల నిర్వాహకులు పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడం.. వారికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అమాయక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.
పలు కొనుగోలు కేంద్రాల్లో..
జిల్లాలోని పలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్య ంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తా 40.70 కేజీల తూకం వేయాలి. కానీ 41.50కేజీల తూకం పెడుతున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా రైతులు మిల్లులకు తీసుకెళ్లిన ధాన్యం తూకంలో కూడా తేడా వచ్చిందని, తక్కువ తూకం వేసి మోసం చేశారని రైతులు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నాయి. వీటితోపాటు, పలువురు నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మ కై ్క కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేకున్నా తెచ్చినట్లు తక్‌పట్టీలు ఇచ్చి, మిల్లుకు తరలించినట్లు రికార్డులు చేసిన సంఘటనలు బయటపడ్డాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వరుస క్రమంలో కాంటాలు పెట్టించాలి. అదే క్రమంలో లారీల్లో లోడు వేయించాలి. కానీ కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్థానిక రాజకీయ నాయకులు, డబ్బులు ఆశచూపిన వారి ధాన్యం ముందుగా కాంటాలు పెట్టి లారీల్లో లోడు వేసి పంపించారని కొన్ని సెంటర్ల వద్ద రైతులు నిర్వాహకులను నిలదీసిన సంఘటనలు ఉన్నాయి.
అమాయక రైతులు
రోజుల తరబడి నిరీక్షణ
వర్షంతో తడిసిన ధాన్యం,
మళ్లీ ఆరబెట్టాలంటున్న అధికారులు
పలు కేంద్రాల్లో అక్రమాలు

నిర్వాహకుల ఇష్టారాజ్యం!