
నర్సింహులపేట, కురవిలో భారీ వర్షం
నర్సింహులపేట: మండలంలో మంగళవారం రాత్రి 7 గంటలకు భారీగా వర్షం కురిసింది. మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నుంచి వరద నీరు పోటెత్తింది.
కురవి : మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారు. కురవి, నేరడ, అయ్యగారిపల్లి గ్రామాల్లో కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం బస్తాలున్నాయి.
చెరువుకట్టకు బుంగ
మండలంలోని నేరడ గ్రామ పెద్ద చెరువు కట్టకు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బుంగ పడింది. చెరువుకట్టపై దర్గా మాదిరిగా నిర్మాణం చేసి ఉంది. ఆ నిర్మాణం కింది భాగంలో బుంగ పడడంతో చెరువుకట్టకు ప్రమాదం పొంచి ఉంది. అలాగే చెరువు సమీపంలో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీ కూలింది.

నర్సింహులపేట, కురవిలో భారీ వర్షం