
సరస్వతి విగ్రహ పీఠం సిద్ధం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతినది పుష్కరాలకు సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహ ఏర్పాటుకు మంగళవారం పీఠం సిద్ధం చేశారు. భారీ క్రేన్‌తో రాతిపీఠాన్ని కాంక్రీటు స్టాండ్‌పై పెట్టారు. బుధవారం దశమి సందర్భంగా 10 ఫీట్ల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని క్రేన్ సాయంతో పీఠంపైన అమర్చనున్నారు. ఈ విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో రూ.50లక్షల వ్యయంతో నాలుగు వేదమూర్తుల విగ్రహాలను తయారు చేయించారు.
సరస్వతినది పుష్కరాల ప్రారంభానికి సీఎం
కాళేశ్వరంలో మే 15న సరస్వతినది పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఆయనకు హైదరాబాద్‌లో మంగళవారం ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల15న పుష్కరాల కార్యక్రమాన్ని మెదక్ రంగంపేటకు చెందిన స్వామిజీ మాధవనందసరస్వతి చేతులమీదుగా ప్రారంభిస్తారు.
కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో
సింగరేణికి హాల్టింగ్ పునరుద్ధరణ
కాజీపేట రూరల్ : భద్రాచలంరోడ్–బల్లార్షా సింగరేణి ప్యాసింజర్‌కు కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో యథావిధిగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఇంజనీరింగ్ బ్లాక్ వల్ల గతంలో సింగరేణి ప్యాసింజర్‌కు కాజీపేట టౌన్ స్టేషన్‌లో హాల్టింగ్‌ను ఎత్తివేశారు. రైల్వే బ్లాక్ పనుల అనంతరం సికింద్రాబాద్ రైల్వే అధికారులు సింగరేణి ప్యాసింజర్‌కు కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో యథావిధిగా హాల్టింగ్‌తో మంగళవారం నుంచి నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) వెళ్లే సింగరేణి ప్యాసింజర్ కాజీపేట టౌన్‌కు ప్రతి రోజు ఉదయం 09:08 గంటలకు చేరుతుందని, తిరుగు ప్రయాణంలో సిర్‌పూర్‌టౌన్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే సింగరేణి ప్యాసింజర్‌గా కాజీపేట టౌన్‌కు ప్రతి రోజు మధ్యాహ్నం 3:25 గంటలకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు
కాజీపేట జంక్షన్ మీదుగా విజయవాడ, సికింద్రాబాద్, బల్లార్షా రూట్‌లో అప్ అండ్ డౌన్ ప్రయాణించే 10 ప్యాసింజర్ రైళ్లను మంగళవారం నుంచి యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కేయూకు కంప్యూటర్ల వితరణ
కేయూ క్యాంపస్ : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సామాజిక బాధ్యతగా కాకతీయ యూనివర్సిటీకి మరో 60 కంప్యూటర్లను సోమవారం రాత్రి వితరణ చేసింది. వీటిని మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి కంప్యూటర్ విభాగం అధ్యాపకుడు, కేయూ నెట్‌వర్క్ డైరెక్టర్ డి.రమేశ్ స్వీకరించారు. కంప్యూటర్లు అందజేయడంతో కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, వి.రామచంద్రం స్వాగతిస్తూ ఆ సంస్థను అభినందంచారు. 15 కంప్యూటర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి, 5 బయోటెక్నాలజీకి, 5 కెమిస్ట్రీకి, 10 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, కేయూ ఇంజనీరింగ్ కాలేజీ (కోఎడ్యుకేషన్‌కు)కి 5, జువాలజీ–5, జర్నలిజం విభాగానికి రెండు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి–4, హాస్టల్ ఆఫీస్‌కు మూడు కంప్యూటర్లను అందజేశారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

సరస్వతి విగ్రహ పీఠం సిద్ధం

సరస్వతి విగ్రహ పీఠం సిద్ధం