మద్యం..చోద్యం! | - | Sakshi
Sakshi News home page

మద్యం..చోద్యం!

May 4 2025 7:01 AM | Updated on May 4 2025 7:01 AM

మద్యం

మద్యం..చోద్యం!

ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025

IIలోu

సాక్షి, మహబూబాబాద్‌/ మహబూబాద్‌ అర్బన్‌/ మహబూబాబాద్‌ రూరల్‌/ నెహ్రూసెంటర్‌: మందుబాబులకు ఎంజాయ్‌మెంట్‌.. మహబూబాబాద్‌ పట్టణ ప్రజలకు పనిష్‌మెంట్‌గా మారింది. మందుతాగేందుకు వైన్స్‌, పర్మిట్‌ రూములు, బార్లు ఉన్నా.. కొందరు ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాలు, మరికొందరు రోడ్డు మీదనే మద్యం తాగడం ఫ్యాషన్‌గా మారింది. విచ్చలవిడిగా మద్యం తాగి అటువైపుగా వచ్చిన విద్యార్థులను, మహిళలను ఇబ్బంది పెడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పట్టణంలో పలు ప్రాంతాలను ‘సాక్షి’విజిట్‌ చేసింది. ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

● మహబూబాబాద్‌ పట్టణంలోని ఇల్లెందు బైపాస్‌ మిల్లుల వెనకాల ఖాళీ స్థలం, నందినగర్‌ వెంచర్‌, రాంచంద్రాపురం కాలనీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రాంతం, నందనా గార్డెన్‌, మిషన్‌ భగీరథ ట్యాంకు, చెరువు కట్ట, మహర్షి స్కూల్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో గుంపులుగుంపులుగా కూర్చొని మందు సేవించడం కంట పడింది. అటువైపు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, భయంభయంగా వెళ్తున్నామని మహిళలకు చెబుతున్నారు.

● వివేకానంద సెంటర్‌, బస్టాండ్‌, నర్సంపేట బైపాస్‌రోడ్డులోనే అత్యధికంగా వైన్స్‌ ఉన్నాయి. షాపుల్లో మద్యం తీసుకొని పక్కనే రోడ్డుమీద ఉండి మద్యం సేవిస్తున్నారు. దీంతో వెంకట్రామ టాకీస్‌సందు, బతుకమ్మ ఘాట్‌, హన్మంతుడిగడ్డ, బెస్త బజార్‌ వైపు వెళ్లే మహిళలను, విద్యార్థినులను చూసి సూటిపోటీ మాటలనడంతో రాత్రి అయితే అటు వైపు వెళ్లడం లేదు. అదేవిధంగా లేడీస్‌ టైలర్లు ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే ఉండటంతో.. అక్కడికి వచ్చిన మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని మహిళలకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● మూడుకోట్ల సెంటర్‌లోని వైన్స్‌ వద్ద నుంచి మందు తీసుకొని పక్కనే ఉన్న గల్లీలోకి వెళ్లి మద్యం తాగుతూ అటువైపుగా వెళ్తున్న మహిళలను కామెంట్‌ చేస్తున్నారని, ఖాళీ సీసాలు విసిరి వేయడం, ఇళ్ల ముందు బాటిల్స్‌ పెట్టడం, రాత్రి వరకు గొడవలు పెట్టుకుంటున్నారని మహిళల చెబుతున్నారు. ఏమైనా అంటే గొడవలకు దిగడం, బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

● ఫాతిమా స్కూల్‌ ముందు గ్రౌండ్‌, బాబునాయక్‌ తండాకు వెళ్లేదారి దారిలో ఉన్న ఖాళీ స్థలాలు సాయంత్రం అయితే చాలు బార్లను తలపించే విధంగా గుంపులుగుంపులుగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. గుండ్ల బోడు తండా ముందు వెంచర్‌లో మద్యం సేవించి రోడ్డుమీద ఉన్న కూరగాయల షాపుల్లోకి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని, దీంతో సాయంత్రం అయితే అటుగా రావాలంటే భయపడుతున్నారని, కూరగాయల గిరాకీ తగ్గిందని మహిళలు చెబుతున్నాను.

న్యూస్‌రీల్‌

వాళ్లకు ఎంజాయ్‌మెంట్‌.. వీళ్లకు పనిష్‌మెంట్‌

బహిరంగ ప్రదేశాల్లో

మందుబాబుల హల్‌చల్‌

ప్రధాన రహదారుల వెంబడి తిష్టా

అటువైపుగా వెళ్లాలంటే

భయపడుతున్న మహిళలు

‘సాక్షి’ విజిట్‌లో తేలిన నిజాలు

మద్యం..చోద్యం!1
1/5

మద్యం..చోద్యం!

మద్యం..చోద్యం!2
2/5

మద్యం..చోద్యం!

మద్యం..చోద్యం!3
3/5

మద్యం..చోద్యం!

మద్యం..చోద్యం!4
4/5

మద్యం..చోద్యం!

మద్యం..చోద్యం!5
5/5

మద్యం..చోద్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement