ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్‌ను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రెవె న్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్‌శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టంపై జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శంకగా జరగాలన్నారు. అధికారులు భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్‌వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.


