గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం

Mar 12 2025 7:38 AM | Updated on Mar 12 2025 7:34 AM

శాయంపేట : మండలంలోని తహరాపూర్‌ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్‌ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్‌–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్‌ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్‌ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్‌ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌–1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌–1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు.

నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి

లీడ్‌ బిడ్‌ మేనేజ్‌మెంట్‌ జీఎం శివభాస్కర్‌

హసన్‌పర్తి : ప్రతీ విద్యార్థి నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని లీడ్‌ బిడ్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్‌పీఎల్‌ జీఎం, ఇండియా సర్వీసెస్‌ జీఎం శివ భాస్కర్‌ నేతి అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ ‘వ్యూహ–2025’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి శివభాస్కర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త మార్గాలు తెరుస్తోందన్నారు. ఎస్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దీపక్‌ గార్గ్‌ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచడానికి ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ వైపు దృష్టి సారించాలన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుకనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. తొలుత ఎస్సార్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ ఎ.వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్‌ సుమన్‌, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

61 మహిళా శక్తి అద్దె బస్సులు

హన్మకొండ: ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌కు 61 మహిళా శక్తి అద్దె బస్సులు కేటాయించారని ఆర్టీసీ ఆర్‌ఎం డి.విజయభాను తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ బస్సులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళ శక్తి మిషన్‌–25ను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు అందిస్తున్నట్లు తెలిపారు.

గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం
1
1/2

గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం

గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం
2
2/2

గ్రూప్‌–1 ర్యాంకర్‌ తేజస్వినికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement