పనికి వెళ్తూ ప్రమాదంలోకి.. | - | Sakshi
Sakshi News home page

పనికి వెళ్తూ ప్రమాదంలోకి..

Mar 9 2025 1:34 AM | Updated on Mar 9 2025 1:32 AM

ఏటూరునాగారం: మిర్చి ఏరడానికి వెళ్లి వస్తున్న కూలీల వాహనం బోల్తా పడి 9 మందికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన 16మంది వలస కూలీలు మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో శనివారం ఏటూరునాగారం మండలంలోని రాంనగర్‌ గ్రామానికి చెందిన ఒక రైతు చేనులో మిర్చి ఏరేందుకు వెళ్లారు. సాయంత్రం పనిముగిసిన అనంతరం పంట యజమాని స్వయంగా టాటా ఏస్‌ వాహనంలో కూలీలను ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఈ రాంనగర్‌– కమలాపురం మధ్యలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన కూలీలను హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. గాయపడిన, పేగులు బయటకు వెళ్లిన క్షతగాత్రులకు వైద్యులు, సిబ్బంది చికిత్స చేశారు.

గాయపడిన వారిలో మైనర్లు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌ జిల్లాకు చెందిన వారు మిర్చితోట కూలీ పనులకు వచ్చిన వారిలో మైనర్లు కూడా ఉండడం గమనార్హం. మైనర్లు కూడా ఈ ఘటనలో గాయపడడం బాధాకరం. అలాగే, తీవ్ర గాయాలైన వారిలో పోడియం మున్న, మూచకి గగ్గు, మూచకి లక్కు, కోవ్వాసి శాంతి, పాయం లక్ష్మి ఉన్నారు.

అనేకమార్లు హెచ్చరించినా..

ప్రమాదవిషయాన్ని తెలుసుకున్న ఎస్సై తాజొద్దీన్‌ సామాజిక ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కూలీలను గూడ్స్‌ వాహనాల్లో తీసుకెళ్లొద్దని రైతులు, కూలీలకు, కూలీల ముఠా మేసీ్త్రలను హెచ్చరించినా.. మారడంలేదన్నారు. మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో నలుగురు మరణించారు. మైనర్లను కూలీలుగా పెట్టుకోవద్దన్నారు.

కూలీల వాహనం బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

నలుగురి పరిస్థితి విషమం

పనికి వెళ్తూ ప్రమాదంలోకి..1
1/1

పనికి వెళ్తూ ప్రమాదంలోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement