‘వరి’గిన పైరు | - | Sakshi
Sakshi News home page

‘వరి’గిన పైరు

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

బనగానపల్లె: బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షానికి దిగుబడులు చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలి గింజలు రాలిపోయాయి. దీంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌ఆర్‌బీసీ వ్యవసాయ బోర్ల కింద వేల ఎకరాల్లో రబీలో వరి పంటను సాగు చేశారు. గత 15 రోజులుగా పంట దిగుబడులు కల్లాలకు చేరుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో గత కొద్ది రోజులుగా నెలకొన్న డీజిల్‌ సమస్య వల్ల పంటకోత యంత్రాలు నిలిచిపోవడంతో నూర్పిడిలో ఆలస్యం అయ్యిందని రైతులు వాపోయారు. దీనికి తోడు అకాల వర్షం, ఈదురు గాలులతో ఉహించని విధంగా వరి పంటకు నష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు షుగర్‌లెస్‌ రకం వరి పంటను సాగు చేశారు. 75 కిలోల ఒడ్ల బస్తా రూ.1500–1550కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం వర్షానికి తడవడం వల్ల నాణ్యత లోపం సాకుతో వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరికి గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరతున్నారు.

నేలవాలిన కొర్ర

కోడుమూరు రూరల్‌: భారీ ఈదురు గాలులు కొర్ర రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కో డుమూరు మండలంలో గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద ఆరుతడి పంటగా 300కు పైగా ఎకరాల్లో కొర్ర పంట సాగు చేశారు. ప్రస్తుతం కొర్ర పంట దిగు బడి దశకు రావడంతో రైతులు కోతలకు కోసేందుకు సిద్ధమవుతున్నా రు.ఈ నేపథ్యంలో మంగళవారం సా యంత్రం నుంచి రాత్రి వరకు వీచిన భారీ ఈదురుగాలులకు కొర్ర పైరు నేలవాలి భారీగా గింజలు రాలిపోవడ ంతో తీవ్రనష్టంవాటిల్లినట్లు రైతులు వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement